అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అతను అనుకోలేదు. ఎందుకంటే అది ముసలిది. అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు. ఆ పని చేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు.
అతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. హమ్మయ్య ఆనుకున్నాడు. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నిలబడి పైకి రాసాగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతడు తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు. ఇది వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న కథ.
దీనికి వ్యతిరేకంగా జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో సోమవారం చోటు చేసుకుంది. ఓ ఆవు 35 అడుగుల లోతున్న బావిలోకి పడిపోయింది. అయితే దాన్ని అలాగే వదిలేయాలని అక్కడి వారు అనుకోలేదు. బావిలో చిక్కుకుపోయిన మూగజీవిని ఎలాగైనా రక్షించాలనుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంలో దాన్ని బావిలోంచి బయటకు తీశారు. తాళ్ల సహాయంలో ఆవును బావిలోంచి బయటకు లాగారు. సాధు జంతువు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మూగజీవాల మట్ల మనుషులకు మమకారం తగ్గలేదనడానికి ఈ ఉదంతం అద్దం పట్టింది.
ఔరా! ఆవు కథ
Published Tue, Jun 14 2016 9:23 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement