ప్రధాని కార్యదర్శి వేతనం రూ.2 లక్షలు | PMO makes salaries of officials public: Bhaskar Khulbe highest paid, takes home Rs 2.01 lakh | Sakshi
Sakshi News home page

ప్రధాని కార్యదర్శి వేతనం రూ.2 లక్షలు

Aug 9 2016 11:48 AM | Updated on Sep 4 2017 8:34 AM

ప్రధాని కార్యదర్శి వేతనం రూ.2 లక్షలు

ప్రధాని కార్యదర్శి వేతనం రూ.2 లక్షలు

ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారుల జీతాలను ప్రజలందరికీ తెలిసేలా పీఎంవో వెబ్‌సైట్‌లో ఉంచారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారుల జీతాలను ప్రజలందరికీ తెలిసేలా పీఎంవో వెబ్‌సైట్‌లో ఉంచారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పీఎంవో ఈ చర్యలు తీసుకుంది. పీఎంవోలోని ఉద్యోగులందరిలో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ ఖుల్బీ అత్యధికంగా నెలకు రూ.2.01 లక్షల వేతనం అందుకుంటున్నారు.

ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నెలకు రూ. 1,62,500 వేతనంతో పాటు పెన్షన్ అందుకుంటున్నారు. అత్యధిక వేతనం తీసుకుంటున్న వీరంతా రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులే.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement