16 మంది ఎంపీలకు పీఎంవో ఫోన్లు | pmo calls 16 bjp mp's for swearing in cermony | Sakshi
Sakshi News home page

16 మంది ఎంపీలకు పీఎంవో ఫోన్లు

Nov 8 2014 6:33 PM | Updated on Aug 15 2018 2:20 PM

కేంద్ర మంత్రివర్గాన్ని ఆదివారం నాడు విస్తరిస్తున్న సందర్భంగా పలువురు ఎంపీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి.

కేంద్ర మంత్రివర్గాన్ని ఆదివారం నాడు విస్తరిస్తున్న సందర్భంగా పలువురు ఎంపీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మొత్తం 20 మంది వరకు కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికి 16 మంది బీజేపీ ఎంపీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి.

వాళ్లలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. వీళ్లంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్న విషయం తేలిపోయింది. వాళ్లు కాక.. శివసేన, టీడీపీలకు చెందిన ముగ్గురికి కూడా మంత్రిపదవులు ఖాయమని తెలిసింది. ఇంతవరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారిక్కర్ను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నందున ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు ఎన్నుకోడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement