ముందుగా మీకు క్షమాపణ చెబుతున్నా...

PM Narendra Modi Apologises Shantiniketan University Students - Sakshi

కోల్‌కతా : శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ 49వ స్నాతకోత్సవ కార్యక్రమం... ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక​ హసీనా, పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ కేఎన్‌ త్రిపాఠి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో కొన్ని ఆశ్చర్యపరిచే సన్నివేశాలను కూడా చూడాల్సి వచ్చింది. ప్రధాని పదవిలో ఉన్న మోదీనే ఏకంగా యూనివర్సిటీ విద్యార్థులను క్షమాపణ కోరారు. ఎందుకో తెలుసా..?? యూనివర్సిటీ పరిసరాల్లో సరియైన మంచి నీటి సౌకర్యం అందించలేకపోవడంతో మోదీ క్షమాపణ కోరారు.

 ‘విశ్వభారతి యూనివర్సిటీ ఛాన్సలర్‌గా నేను మీ క్షమాపణ కోరుతున్నా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కొంతమంది విద్యార్థులు సంజ్ఞల ద్వారా యూనివర్సిటీలో మంచి నీరు సరిగ్గా అందడం లేదని చెప్పారు. మీకు అసౌకర్యం కలిగించినందుకు యూనివర్సిటీ ఛాన్సలర్‌గా క్షమాపణ కోరుతున్నా’ అని మోదీ అన్నారు. మోదీ రాకకు యూనివర్సిటీ విద్యార్థులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్న సమయంలో ప్రధాని ఇలా క్షమాపణ చెప్పి, తన ఔనత్యాన్ని చాటుకున్నారు. సరియైన మంచినీటి సౌకర్యం లేక యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు అనారోగ్యం పాలైనట్టు కూడా పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఇక నుంచి యూనివర్సిటీలో మంచినీటి సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని హామీ ఇచ్చారు. 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top