ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

PM Modi Flag Hoisting At Red Fort In Delhi - Sakshi

దేశ వ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సాక్షి, న్యూఢిల్లీ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవాన్ని స్వీకరించిన అనంతరం జెండానుఎగరేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మునికి, అమరవీరులకు నివాళి అర్పించారు. కాగా ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను ఎగరవేయడం ఇది ఆరోసారి. ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రత్యేక విన్యాసాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భద్రతా దళాలకు చెందిన వివిధ విభాగాలు ప్రత్యేక దుస్తులు ధరించి విన్యాసాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్‌, స్వాంతత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top