లాక్‌డౌన్‌ కొనసాగింపునకే మోదీ మొగ్గు..! | PM Modi Discussion With CMs On Lockdown Situation | Sakshi
Sakshi News home page

వీడియో కాన్ఫరెన్స్‌: మోదీ నిర్ణయంపై ఉత్కంఠ

Apr 27 2020 11:23 AM | Updated on Apr 27 2020 12:04 PM

PM  Modi Discussion With CMs On Lockdown Situation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం దేశమంతా ఉత్కంఠ రేపుతోంది. వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పట్టుపడుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మృత్యుల సంఖ్యా 1000కి చేరువులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ సమావేశంలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారాన్ని సేకరిస్తూనే వారి నుంచి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. (సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌)

అయితే వైరస్‌ తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాంతాల వారిగా సడలింపు ఇస్తుందని తెలుస్తోంది. మరికొన్ని సేవలకు సడలింపు ఇస్తూనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేలా కేంద్రం ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగానే వైరస్‌ వ్యాప్తి అధికంగా ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేసి కేవలం నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బస్సులు, ట్యాక్సీలు పరిమిత వేళల్లో తక్కువ మందితో తిరగడానికి అనుమతి ఇస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాలు మాత్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ ఆంక్షలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. తాజాగా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశంపై ప్రముఖంగా చర్చకు రానుంది.

ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అదే స్థాయిలో మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే తీవ్ర అనార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు లాక్‌డౌన్‌ కొనసాగింపుకే మోదీ మొగ్గుచూపుతారని తెలుస్తోంది. మరోవైపు ప్రజల ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వివిధ దేశాలు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మే 3 నుంచి దశల వారిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ చేయబోయే ‍ప్రకటన కీలకం కానుంది.(లాక్‌డౌన్‌ ఎత్తివేతకు పంచతంత్రం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement