సంఘటిత రంగంలోని కార్మికులు పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ, డిపాజిట్ ఆధారిత బీమా వంటి పథకాల ప్రయోజనాలను...
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని కార్మికులు పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ, డిపాజిట్ ఆధారిత బీమా వంటి పథకాల ప్రయోజనాలను పొందేందుకు వీలుగా ఒకే స్మార్ట్‌కార్డ్‌ను జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం వారి యూనివర్సల్ పీఎఫ్ అకౌంట్ నంబర్(యూఏఎన్), ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా నంబర్లతోపాటు బ్యాంకు బ్రాంచీల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను సేకరించి స్మార్ట్‌కార్డ్‌కు అనుసంధానించాలనుకుంటోంది. తద్వారా స్మార్ట్‌కార్డ్‌ను కార్మికుల వివరాల గుర్తింపుతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలను ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా ధ్రువీకరించుకునేందుకు సాధనంగా ఉపయోగించుకోనుంది.