ఇప్పటికే యోగా నైపుణ్యాన్ని ఒంటబట్టించుకున్న బీఎస్‌ఎఫ్ దళాలు ఇకపై పతంజలి ఉత్పత్తులను వినియోగించనున్నాయి.
న్యూఢిల్లీ: ఇప్పటికే యోగా నైపుణ్యాన్ని ఒంటబట్టించుకున్న బీఎస్‌ఎఫ్ దళాలు ఇకపై పతంజలి ఉత్పత్తులను వినియోగించనున్నాయి. ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్ క్యాంపులలో తొలి పతంజలి ఉత్పత్తుల దుకాణాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఎస్‌ఎప్ భార్యల సంక్షేమ సంఘం.. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డజనుకుపైగా బీఎస్‌ఎఫ్ క్యాంటీన్లలో పతంజలి ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు.