దేశంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వేకువజామున పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. గ్రహణం..
కోల్‌కతా: దేశంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వేకువజామున పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. గ్రహణం.. సుమత్రా, బొర్నియో వంటి ఆసియా ఖండ దీవులతో పాటు మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సంపూర్ణంగా ఏర్పడనుంది. భారత్‌లో మాత్రం వివిధ ప్రాంతాల్లో 12 నుంచి 18 శాతందాకా ఏర్పడనుంది. ముంబై,ఢిల్లీ సహా పశ్చిమ, వాయవ్య, ఉత్తర భారతప్రాంతాల్లో కనిపించదు.
హైదరాబాద్‌లో ఉదయం 6.29కే గ్రహణం ప్రారంభమై.. 6.47కు ముగుస్తుంది. 12 శాతమే కనిపించనుంది. భ అండమాన్ నికోబార్‌లో మాత్రం అత్యధికంగా సగం వరకూ సూర్యుడిని చంద్రుడు అడ్డుకోనున్నాడు. భువనేశ్వర్‌లో 24 శాతం, కోల్‌కతాలో 18.5 శాతం వరకూ గ్రహణం కనిపిస్తుంది.