breaking news
Partial solar eclipse
-
సూర్యగ్రహణాన్ని చూశారా..
హైదరాబాద్ లో సూర్యగ్రహణం కనిపించిందిలా.. హైదారాబాద్: నేటి సూర్యగ్రహణాన్ని మీరు వీక్షించారా? పాక్షికంగానే కనిపించినప్పటికీ ఇండోనేషియా, మధ్య పసిఫిక్ దీవుల్లోని ప్రజలు మాత్రం బుధవారం పొద్దున్నే నిద్రలేచి సూర్యగ్రహణాన్ని ఎంజాయ్ చేశారు. సూర్యగ్రహణం హైదరాబాద్‌లో ఉదయం 6.29కే ప్రారంభమై.. 6.47కు ముగిసింది. ఇక్కడ పాక్షికంగా గ్రహణం 12 శాతమే కనిపించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం అత్యధికంగా సగం వరకూ సూర్యుడిని చంద్రుడు అడ్డుకున్నాడు. భువనేశ్వర్‌లో 24 శాతం, కోల్‌కతాలో 18.5 శాతం వరకూ గ్రహణం కనిపించింది. ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించి గ్రహణాన్ని వీక్షిస్తున్న ఇండోనేషియన్ యువతులు -
నేడు పాక్షిక సూర్యగ్రహణం
కోల్‌కతా: దేశంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వేకువజామున పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది. గ్రహణం.. సుమత్రా, బొర్నియో వంటి ఆసియా ఖండ దీవులతో పాటు మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సంపూర్ణంగా ఏర్పడనుంది. భారత్‌లో మాత్రం వివిధ ప్రాంతాల్లో 12 నుంచి 18 శాతందాకా ఏర్పడనుంది. ముంబై,ఢిల్లీ సహా పశ్చిమ, వాయవ్య, ఉత్తర భారతప్రాంతాల్లో కనిపించదు. హైదరాబాద్‌లో ఉదయం 6.29కే గ్రహణం ప్రారంభమై.. 6.47కు ముగుస్తుంది. 12 శాతమే కనిపించనుంది. భ అండమాన్ నికోబార్‌లో మాత్రం అత్యధికంగా సగం వరకూ సూర్యుడిని చంద్రుడు అడ్డుకోనున్నాడు. భువనేశ్వర్‌లో 24 శాతం, కోల్‌కతాలో 18.5 శాతం వరకూ గ్రహణం కనిపిస్తుంది.