భారత్‌ విజ్ఞప్తిని ఐసీజే నిజంగా తిరస్కరించిందా? | Pak Claims ICJ Rejected India's Request To Delay Kulbhushan Jadhav Case | Sakshi
Sakshi News home page

భారత్‌ విజ్ఞప్తిని ఐసీజే నిజంగా తిరస్కరించిందా?

Jun 16 2017 1:53 PM | Updated on Sep 5 2017 1:47 PM

భారత్‌ విజ్ఞప్తిని ఐసీజే నిజంగా తిరస్కరించిందా?

భారత్‌ విజ్ఞప్తిని ఐసీజే నిజంగా తిరస్కరించిందా?

కులభూషణ్‌ జాదవ్‌ కేసు విషయంలో భారత్‌ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించిందని పాకిస్థాన్‌ పేర్కొంది.

ఇస్లామాబాద్‌: కులభూషణ్‌ జాదవ్‌ కేసు విషయంలో భారత్‌ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించిందని పాకిస్థాన్‌ పేర్కొంది. సెప్టెంబర్‌లోగా ప్రతిస్పందన తెలియజేయాలంటూ భారత్‌కు ఆదేశించినట్లు వెల్లడించింది.

‘నెదర్లాండ్‌లోని మా కాన్సులేట్‌ ద్వారా మేం తెలుసుకున్న విషయం ఏమిటంటే కులభూషణ్‌ జాదవ్‌ కేసు విషయంలో ప్రతిస్పందన తెలియజేసేందుకు డిసెంబర్‌ వరకు పొడిగించాలని భారత్‌ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించింది. సెప్టెంబర్‌ 13లోగా తెలియజేయాలంటూ ఆదేశించింది’ అని పాక్‌ అటార్నీ జనరల్‌ అష్తర్‌ ఔషఫ్‌ అలీ చెప్పినట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది. తమ దేశంలో గూఢచర్యం నిర్వహించాడనే ఆరోపణలతో భారత్‌కు చెందిన నేవీ మాజీ అధికారి అయిన కులభూషణ్‌ జాదవ్‌కు పాకిస్థాన్‌ మరణ శిక్షను విధించడంతో భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పాక్‌కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement