ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మరోసారి భంగపాటు ఎదురైంది.
ఆగ్రా: ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మరోసారి భంగపాటు ఎదురైంది. ఆగ్రాలో ఈ నెలలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు జిల్లా అధికారులు. స్థానిక ఎంఐఎం నేతలు మార్చి 29న ఆగ్రాలో ర్యాలీ, బహిరంగసభను ఏర్పటు చేశారు. దీనికి ఓవైసీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాఠశాలల ఫైనల్ పరీక్షల కారణంగా బహిరంగ నిర్వహించడం సాధ్యంకాదని జిల్లా అధికారి రాజేష్ శ్రీవాస్తవ తెలిపారు.
అయితే ఓవైసీ సభకు అనుమతిస్తే నగరంలోని ప్రశాంతవారణానికి విఘాతం కలిగే అవకాశ ఉందనీ...అనుమతి నిరాకరించాలని కోరుతూ భజరంగ దళ్, వీహెచ్పీ, హిందూజాగరణ్ మంచ్ లాంటి సంస్థలు స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో కూడా ఒవైసీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు.