నటిని పశువుతో పోల్చిన అధికారి | UP Official Called Sonakshi Sinha a Dhan Pashu | Sakshi
Sakshi News home page

సోనాక్షిపై విమర్శల వర్షం కురిపించిన అధికారి

Sep 24 2019 1:47 PM | Updated on Sep 24 2019 2:00 PM

UP Official Called Sonakshi Sinha a Dhan Pashu - Sakshi

లక్నో: బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా విపరీతంగా ట్రోల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. గత వారం కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హాజరైన సోనాక్షి.. రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. నాటి నుంచి సోషల్‌ మీడియాలో, బయట జనాలు సోనాక్షిని విపరీతంగ్రా ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యూపీ అధికారి సోనాక్షిని ధన పశువు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివరాలు.. సునిల్‌ భరాలా అనే సీనియర్‌ అధికారి ఒకరు.. ‘ఆధునిక కాలంలో ఇలాంటి జనాలు కేవలం డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు. డబ్బు సంపాదించడం.. దాన్ని కూడా తమ కోసమే ఖర్చు పెట్టడం గురించి మాత్రమే వీళ్లు ఆలోచిస్తారు. ఇలాంటి వారికి చరిత్ర గురించి కానీ, దేవుడి గురించి కానీ ఎలాంటి అవగాహన ఉండదు. తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించారు. వీరంతా ధన పశువులు. వీరిని చూసి చింతించడం తప్ప ఏం చేయలేం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కేబీసీ కార్యక్రమానికి హాజరైన సోనాక్షిని, అమితాబ్‌ బచ్చన్‌ రామాయణానికి సంబంధించి ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు అని ప్రశ్నించి, నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. కానీ సోనాక్షి సమాధానం చెప్పలేక లైఫ్‌లైన్‌ వినియోగించుకున్న సంగతి తెలిసిందే. సోనాక్షి తీరు పట్ల బిగ్‌ బీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీ ఇంటికి రామాయణం అని పెట్టుకున్నారు. అన్నిటింకి మించి రాముడి సోదరుల్లో ఒకరి పైరైనా శత్రుఘ్న పేరును మీ తండ్రి పెట్టుకున్నాడు. అయినా నీకు ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా అంటూ బిగ్‌ బీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement