భార్య, బాల్యమిత్రుడి చేతిలో ఎన్ఆర్ఐ హతం | NRI murdered by wife, parmour during vacation in India | Sakshi
Sakshi News home page

భార్య, బాల్యమిత్రుడి చేతిలో ఎన్ఆర్ఐ హతం

Sep 10 2016 5:21 PM | Updated on Jul 6 2019 12:42 PM

భార్య, బాల్యమిత్రుడి చేతిలో ఎన్ఆర్ఐ హతం - Sakshi

భార్య, బాల్యమిత్రుడి చేతిలో ఎన్ఆర్ఐ హతం

సెలవులను హాయిగా గడుపుదామని భారత్‌కు వచ్చిన ఓ ఎన్‌ఆర్ఐ దారుణంగా హత్యకు గురయ్యాడు.

షహజాన్‌పూర్: సెలవులను హాయిగా గడుపుదామని భారత్‌కు వచ్చిన ఓ ఎన్‌ఆర్ఐ దారుణంగా హత్యకు గురైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 1న జరిగిన ఈ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు ఎన్ఆర్ఐ మృతికి అతడి భార్య, బాల్య మిత్రుడు కారణమని తేల్చారు.

పోలీసులు వెల్లడించిన వివరాలు.. బ్రిటన్‌లో స్థిరపడిన సుఖ్జిత్ సింగ్(34)కు రమణ్దీప్ కౌర్(31)తో 2005లో వివాహం జరిగింది. గత సంవత్సరం ఫ్యామిలీ హాలిడేకు భారత్‌కు వచ్చిన సమయంలో సుఖ్‌జీత్ సింగ్ బాల్య మిత్రుడు గురుప్రీత్ సింగ్‌తో రమణ్‌దీప్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన రమణ్‌దీప్.. గురుప్రీత్‌తో కలిసి హత్యకు పాల్పడింది. సెప్టెంబర్ 1న నిద్రమాత్రలు కలిపిన అహారాన్ని భర్తకు ఇచ్చిన ఆమె.. గురుప్రీత్‌ను ఆహ్వానించింది. నిద్రలో ఉన్న సుఖ్‌జిత్ సింగ్‌ తలపై గురుప్రీత్ సుత్తితో మోదాడు. రమణ్‌దీప్ దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను అంతం చేసింది. అయినా.. మరణించాడో లేదో అన్న అనుమానంతో పదునైన కత్తితో సుఖ్‌జిత్ సింగ్ గొంతు కోశారు.

హత్య అనంతరం దుబాయ్కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న గురుప్రీత్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రమణ్‌దీప్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించింది. సుఖ్‌జీత్ సింగ్, గురుప్రీత్ స్కూల్ ఫ్రెండ్స్ అని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement