దేశంలో నోట్ల రద్దు సమయంలో రూ 2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలు తమ
	ఇండోర్: దేశంలో నోట్ల రద్దు సమయంలో రూ 2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి వివరాలు తమ దగ్గర లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ రూ 2.5 లక్షలు డిపాజిట్ చేసిన వారి వివరాలు కోరారు.
	గతేడాది నవంబర్ 8నుంచి డిసెంబర్30 వరకూ పాత రూ500, 1000 నోట్లతో రూ 2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసిన వారి
	సమాచారం కావాలని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ సమాధానమిచ్చింది. ఆర్బీఐ వద్ద కోపరేటివ్
	బ్యాంకుల్లోరూ. 2.5లక్షలు డిపాజిట్ చేసిన వారి వివరాలు లేవని సమాధానం ఇచ్చినట్లు గౌడ్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
