హెల్త్‌కేర్‌ సేవలకు జీఎస్టీ లేదు

No GST on food served by hospitals to in-patients - Sakshi

న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లోని రోగులకు వైద్యుల సూచనల మేరకు అందజేసే ఆహారంపై జీఎస్టీ లేదని ప్రభుత్వం తెలిపింది. అనారోగ్యం, గాయం, గర్భం, వంటి కారణాలతో ఆస్పత్రిలో చేరిన వారు చేయించుకునే పరీక్షలు, చికిత్స, వైద్యం వంటివి జీఎస్టీ చట్టం ప్రకారం హెల్త్‌కేర్‌ సేవల పరిధిలోకి వస్తాయని, వీటిపై పన్ను ఉండదంది. దీంతోపాటు ఆస్పత్రులకు రోగులు చెల్లించే మొత్తం (వైద్యుల ఫీజు సహా)నకు కూడా జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఆస్పత్రిలో అడ్మిట్‌ కాని రోగులు, వారి సంబంధీకులకిచ్చే ఆహారంపై జీఎస్టీ ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 

Back to Top