ప్రతి ఒక్కరికీ ఇక్కడే ఉద్యోగం, ఉపాధి: సీఎం

Nitish Kumar Says Government Resolves To Provide Employment to Everyone Within State - Sakshi

వలసలను అరికడతామన్న బిహార్‌ ముఖ్యమంత్రి

పట్నా: రాష్ట్రం నుంచి వలసలను అరికట్టేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యం, పరిశ్రమలను మరింతగా అభివృద్ధి చేసి వలసలు అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు.. బిహార్‌ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్‌ వేదికగా పలు విషయాలను వెల్లడించింది. ‘‘అధిక సంఖ్యలో ప్రజలకు ఇక్కడే ఉద్యోగం, ఉపాధి కల్పించాలనేదే మా ఆకాంక్ష. తద్వారా ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. వాణిజ్య- వ్యాపారాలు, పరిశ్రమలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితే ఉద్యోగాల కల్పన సులభతరంగా మారుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాం’’ అని సీఎం నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతున్న వీడియోను షేర్‌ చేసింది.(కరోనా: కాస్త ఊరటనిచ్చే కబురు! )

కాగా లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల కష్టాలు.. సొంత రాష్ట్రానికి చేరుకునే క్రమంలో పలువురు మృత్యువాత పడటం వంటి హృదయవిదారక ఘటనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్‌ కుమార్‌ వలసలను అరికడతామంటూ తాజాగా ప్రకటన చేయడం గమనార్హం. ఇక వలస కార్మికుల విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఏకంగా ‘మైగ్రేషన్‌ కమిషన్‌’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వలస కార్మికులకు రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామన్న యోగి.. ఈ మేరకు పలు ఎంఓయూలు కుదుర్చుకుని స్థానికంగా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. (25 రోజుల్లో 376 అంత్యక్రియలు! )  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top