అక్టోబర్‌ 15 నాటికి బకాయిల చెల్లింపు

Nirmala Sitharaman Says Her Ministry Is Working To Ensure That Pending Payments Of All PSUs Are Cleared - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్ధల(పీఎస్‌యూ)కు సంబంధించి చేపట్టాల్సిన బకాయిలన్నింటినీ అక్టోబర్‌ 15 నాటికి పూర్తిగా చెల్లిస్తామని కేం‍ద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పీఎస్‌యూ అధిపతులతో జరిగిన భేటీ అనంతరం ఆమె ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఏజెన్సీలు, పీఎస్‌యూలకు అందించిన సేవలు, వస్తువుల సరఫరా మరే ఇతర పనులకు సంబంధించి పెండింగ్‌ బకాయిలను అక్టోబర్‌ 15లోగా క్లియర్‌ చేస్తామని మంత్రి వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో ఆయిల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌ఏఐ, హాల్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఇండియన్‌ ఆయిల్‌, ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం తదితర పీఎస్‌యూల అధిపతులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top