కన్నతండ్రే యముడయ్యాడు.. కుటుంబ గొడవల నేపథ్యంలో తొమ్మిది రోజుల వయసున్న చిన్నారిని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు ఓ తండ్రి.
పావగడ (కర్ణాటక) : కన్నతండ్రే యముడయ్యాడు.. కుటుంబ గొడవల నేపథ్యంలో తొమ్మిది రోజుల వయసున్న చిన్నారిని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన అరసికెర పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవలకెర గ్రామంలో గురువారం వెలుగు చూసింది. అనసికెర ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపిన మేరకు.. దేవలకెర గ్రామానికి చెందిన ఈరణ్ణ.. గిడ్డయ్యన రొప్ప గ్రామానికి చెందిన ప్రేమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న తుమకూరు ఆస్పత్రిలో ప్రేమ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 25న ఆస్పత్రి నుంచి శిశువుతో పాటు ఇంటికి చేరుకుంది. అప్పటి దాకా ఈరణ్ణ పాపను అపురూపంగా చూసుకున్నాడు.
ఈరణ్ణ తల్లికి ఈ వివాహం నచ్చక పోవడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఈరణ్న తల్లిదండ్రులు 26న పాపను చూడటానికి వస్తున్నారని తెలిసి వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఈరణ్ణ పసికందు కడుపుపై గట్టిగా నులిమాడు. భార్య అడ్డుకుని గొడవ పడటంతో పరారయ్యూడు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన ప్రేమ.. శిశువును ఎత్తుకుని తన పెదనాన్న ఇంటికి వెళ్లింది. బుధవారం భార్య ఉన్న ఇంటికి వెళ్లిన ఈరణ్ణ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాప గొంతు నులిమి చంపేసి వెళ్లిపోయూడు. తన భర్తే కూతురిని చంపాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం అతన్ని అరెస్ట్ చేశారు.