సివిల్స్‌ ‘రిజర్వు’ అభ్యర్థుల సిఫార్సు..

news from upsc on civil services - Sakshi

న్యూఢిల్లీ: 2016లో నిర్వహించిన సివిల్స్‌ పరీక్ష ద్వారా భర్తీకాని స్థానాల కోసం రిజర్వు జాబితాలోని 109 మంది అభ్యర్థుల్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సిఫార్సుచేసింది.

గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో 1209 ఖాళీలకు  1099 పోస్టులు భర్తీ అయ్యాయి. సివిల్స్‌ సర్వీస్‌ నిబంధనల ప్రకారం ఈ జాబితాతో పాటు తర్వాతి స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల రిజర్వు జాబితాను యూపీఎస్సీ తయారుచేయాలి. కేంద్ర సిబ్బంది, శిక్షణాసంస్థ కోరడంతో 87 జనరల్‌ కేటగిరి అభ్యర్థులు, 19 మంది ఓబీసీ, 1 ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థుల రిజర్వు జాబితాను సిఫార్సు చేసింది. ఎం.వరలక్ష్మీ(రోల్‌ నం. 0335242) అనే అభ్యర్థి ఫలితాలను మాత్రం నిలిపేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top