జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్‌ | New map of Jammu and Kashmir and Ladakh | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త మ్యాప్‌

Nov 3 2019 4:14 AM | Updated on Nov 3 2019 4:14 AM

New map of Jammu and Kashmir and Ladakh - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల కొత్త  పటాన్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఇందులో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) జమ్మూకశ్మీర్‌లో ఉండగా, గిల్గిత్‌–బల్టిస్తాన్‌ లదాఖ్‌లో ఉంది. పీఓకేలోని ముజఫరాబాద్‌ భారత సరిహద్దుగా ఉంది. తాజా పటం ప్రకారం లదాఖ్‌ రెండు జిల్లాలను (కార్గిల్, లేహ్‌) కలిగి ఉంది. పాత కశ్మీర్‌ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండగా, అందులోని లదాఖ్, లేహ్‌లను లదాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో చేర్చారు. ఇందులో కార్గిల్‌ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. కార్గిల్‌తో కలిపి రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో 14 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 28 జిల్లాలు ఏర్పాటయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement