ఆ షాపులో ఏదైనా రూ.10లకే.. | ‘Neki Ki Dukan’: A shop that provides you everything for just Rs. 10 | Sakshi
Sakshi News home page

ఆ షాపులో ఏదైనా రూ.10లకే..

Mar 9 2017 9:59 AM | Updated on Sep 5 2017 5:38 AM

నిరుపేదల అవసరాలకు అనుగుణంగా పంజాబ్‌లోని లూధియానాలో ఓ ఎన్‌జీవో ఏ వస్తువునైనా రూ.10లకే అందిస్తోంది.



నిరుపేదల  అవసరాలకు అనుగుణంగా పంజాబ్‌లోని లూధియానాలో ఓ ఎన్‌జీవో ఏ వస్తువునైనా రూ.10లకే అందిస్తోంది. దుస్తుల నుంచి బూట్లు, బొమ్మలు, నిత్యవసరాలు, ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అయితే ఈ షాపులో దొరికే వస్తువులలో ఎక్కువ మొత్తం సెకండ్‌ హ్యాండ్‌వి. 
 
రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఈ షాపులో వస్తువులు కొనడానికి క్యూ కడుతుంటారు. 2014లో ప్రారంభమైన ఈ ఎన్‌జీవో ఇప్పటివరకు 250 మంది శస్త్రచికిత్సలకు సాయం చేసింది. కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని ఎన్‌జీవో సభ్యుడు ఒకరు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement