వైరల్‌ : జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్‌

Neha Kakkar Left In Shock After Indian Idol 11 Contestant Forcibly Kisses Her on Stage - Sakshi

ముంబయి : సోనీ చానెల్‌ నిర్వహిస్తోన్న రియాల్టీ షోలో కంటెస్టెంట్‌ మహిళా జడ్జికి ముద్దుపెట్టి అక్కడున్నవారందరినీ షాక్‌కు గురి చేశాడు. ఊహించని ఘటనతో సదరు మహిళా జడ్జి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా ఇదంతా సోనీ నిర్వహిస్తోన్న 'ఇండియన్‌ ఐడల్‌ 11' లో చోటుచేసుకుంది. అయితే దీనిని సోనీ టీవీ ప్రోమో రూపంలో రిలీజ్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే .. ఇండియన్‌ ఐడల్‌ 11 కార్యక్రమానికి ప్రముఖ గాయకులు అను మాలిక్‌, విశాల్‌ దడ్లానిలతో పాటు నేహా కక్కర్‌ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్‌ గుజరాతీ వేషదారణలో పలు బహుమతులతో స్టేజీ మీదకు వచ్చినట్లు ప్రోమోలో తెలుస్తుంది. పాట పాడిన అనంతరం తనను గుర్తుపట్టారా అంటూ నేహాకక్కర్‌ను అడిగాడు. దీంతో స్టేజీ మీదకు వెళ్లిన నేహా అతను ఇచ్చిన బహుమతులను తీసుకొని కృతజ్ఞతగా అతన్ని హగ్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో అతను అందరూ చూస్తుండగానే  నేహా బుగ్గమీద ముద్దుపెట్టాడు. దీంతో షో వాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆదిత్య నారాయణ అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఈ ఉహించని పరిణామంతో షాక్‌కు గురైన నేహాకక్కర్‌ కార్యక్రమం మద్యలోనే వెళ్లిపోయినట్లు ప్రోమోలో చూపించారు. కాగా, ఈ ఎపిసోడ్‌ ఆదివారం సోనీలో టెలికాస్ట్‌ అవనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top