మోదీపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు | NCP Leader Says PM Modi Talks Like Roadside People | Sakshi
Sakshi News home page

మోదీపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Apr 1 2019 2:29 PM | Updated on Apr 1 2019 2:29 PM

NCP Leader Says PM Modi Talks Like Roadside People - Sakshi

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ నేత, రాజ్యసభ ఎంపీ మజీద్‌ మెమన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నాగరికత తెలియని వ్యక్తిలా, నిరక్షరాస్యుడిలా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దారినపోయే వ్యక్తి తరహాలో మాట్లాడటం ప్రధాని స్ధాయి వ్యక్తికి తగదని హితవు పలికారు. ‘అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి తన రాజ్యాంగ హోదా పట్ల స్పృహతో ఉండాలని, దేశ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలు రోడ్లపై జరగవన్న సంగతి మోదీకి తెలిసిఉండా’లని వ్యాఖ్యానించారు.

కాగా,  పాకిస్తాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలన్న బీజేపీ వ్యాఖ్యలపై గతంలో మెమన్‌ స్పందిస్తూ నేపాల్‌ ఎన్నికల్లో బీజేపీ పోటీచేస్తే అక్కడ పెద్దసంఖ్యలో ఉండే చౌకీదార్లు (కాపలాదారులు) ఆ పార్టీని గెలిపిస్తారని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాం‍గ్రెస్‌-ఎన్పీపీ కూటమి మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమితో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement