త్వరలో పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌

NCERT books to have QR codes from 2019 - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై వచ్చే ఏడాది నుంచి క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్‌ చెప్పారు. ఈ కోడ్‌ను విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్‌ చేయడం ద్వారా ఇంటర్నెట్‌లో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్న వీడియోలు, సబ్జెక్టుల సమాచారాన్ని పొందవచ్చన్నారు.

దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకునే వీలుంటుందని చెప్పారు. విద్యా రుణాలు తీసుకునే విద్యార్థులు తాము చదివే కోర్సు కాలపరిమితితోపాటు తర్వాతి ఏడాది వరకు ఆ రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్‌ శిక్ష అభియాన్, టీచర్‌ ఎడ్యుకేషన్‌లను కలిపి ఒకే కార్యక్రమంగా రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top