గాంధీని ఎందుకు చంపాను?: గాడ్సే | Nathuram Godse's account of Bapu assasination goes for reprint | Sakshi
Sakshi News home page

గాంధీని ఎందుకు చంపాను?: గాడ్సే

Published Tue, Dec 23 2014 10:09 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

మహాత్మాగాంధీ - నాథూరామ్ గాడ్సే

మహాత్మాగాంధీ - నాథూరామ్ గాడ్సే

జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ వినాయక్ గాడ్సే కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతని సోదరుడు గోపాల్ గాడ్సే రాసిన ‘గాంధీని ఎందుకు చంపాను?’ అనే మరాఠీ పుస్తకం ఇంగ్లీష్ అనువాదాన్ని పునర్ముద్రించనున్నారు.

 న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరామ్ వినాయక్ గాడ్సే కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అతని సోదరుడు గోపాల్ గాడ్సే రాసిన ‘గాంధీని ఎందుకు చంపాను?’ అనే మరాఠీ పుస్తకం ఇంగ్లిష్ అనువాదాన్ని పునర్ముద్రించనున్నారు. ఢిల్లీకి చెందిన ఫార్‌సైట్ పబ్లిషర్స్ దీన్ని ముద్రిస్తోంది. 1993 నాటి అనువాదాన్ని సవరించి ఇటీవల వెయ్యి కాపీలు ముద్రించామని దీనికి తాజాగా సంపాదకత్వం వహించిన వీరేందర్ మోహ్రా తెలిపారు.  మరో వెయ్యి కాపీల ముద్రణకు ఆర్డర్ ఇచ్చామని ఆయన చెప్పారు.

1948 జనవరి 30న నాథూరామ్  గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేసి, పోలీసుల వద్ద లొంగిపోయాడు. గాంధీ హత్య కేసులో  గోపాల్ గాడ్సే కూడా నిందితుడు. మరాఠీలో రాసిన‘గాంధీని ఎందుకు చంపాను?’ అనే పుస్తకం హిందీ అనువాదం 1970లో, ఇంగ్లీషు అనువాదం 1993లో ముద్రించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement