గుజరాత్ సీఎంకు మోదీ అభినందనలు | narendra Modi wishes Gujarat CM Anandiben Patel on birthday | Sakshi
Sakshi News home page

గుజరాత్ సీఎంకు మోదీ అభినందనలు

Nov 21 2014 10:17 AM | Updated on Aug 15 2018 2:20 PM

గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

న్యూఢిల్లీ:గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. గత మే నెల్లో గుజరాత్ రాష్ట తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనందీబెన్ శుక్రవారం 73 ఒడిలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందీ బెన్ మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

 

మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 1941 వ సంవత్సరంలో గుజరాత్ లోని ఖరోడ్ గ్రామంలో జన్మించిన ఆనందీబెన్ రాష్ట్ర రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ప్రముఖ స్థానాన్ని సంపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement