తన 66వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల (సెప్టెంబర్) 17న తన తల్లి హిరాబా వద్దకు వెళుతున్నారు.
అహ్మదాబాద్: తన 66వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల (సెప్టెంబర్) 17న తన తల్లి హిరాబా వద్దకు వెళుతున్నారు. నేరుగా గాంధీ నగర్ వెళ్లనున్న ఆయన అక్కడే తన జన్మదినం సందర్భంగా మాతృమూర్తి దీవెనలు తీసుకోనున్నారు. అనంతరం పొరిగింటివారితో కాసేపు గడపడంతోపాటు అక్కడే ఉన్న దివ్యాంగులు, గిరిజనులతో ప్రధాని గడిపేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.
2017లో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అక్కడికి వెళ్లడం ఇది మూడో పర్యటన. ప్రస్తుతం మోదీ తల్లి ఆయన సోదరుడు పంకజ్ మోదీతో కలిసి గాంధీ నగర్ లో ఉంటోంది. అక్కడికే నేరుగా మోదీ వెళ్లనన్నారు. తర్వాత గిరిజనుల జిల్లా అయిన దాహోద్ కు వెళ్లి అక్కడ ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభిస్తారు. అనంతరం నవ్సారి అనే ప్రాంతంలో దివ్యాంగుల ఆశ్రమానికి వెళ్లి వారికి కొన్ని సహాయక పరికరాలు అందించనున్నారు.