రేపు అమెరికాకు మోడీ పయనం | Narendra Modi embarks America visit tomorrow | Sakshi
Sakshi News home page

రేపు అమెరికాకు మోడీ పయనం

Sep 24 2014 4:31 PM | Updated on Aug 24 2018 8:18 PM

రేపు అమెరికాకు మోడీ పయనం - Sakshi

రేపు అమెరికాకు మోడీ పయనం

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకుగాను గురువారం బయల్దేరివెళ్లనున్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకుగాను గురువారం బయల్దేరివెళ్లనున్నారు. జర్మనీలో నైట్ ల్యాండింగ్ మీద ఆంక్షలు ఉండటంతో ప్రయాణ సౌలభ్యం కోసం ఆయన ఒకరోజు ముందే వెళ్తున్నారు. సెప్టెంబర్ 26న న్యూయార్క్ చేరుకుంటారు.

అమెరికాలో మోడీ పలు అధికారిక, వ్యాపార, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. 27వ తేదీ ఉదయం 9/11 స్మారక స్థలం వద్దకు వెళ్తారు. 29, 30 తేదీలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను వైట్హౌస్లో మోడీ కలుసుకుంటారు. శ్రీలంక, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాధినేతలతో సమావేశం కానున్నారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభకు హాజరై, ఆ తర్వాత వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement