పీపీ రావుకు కన్నీటి వీడ్కోలు | Naidu condoles death of advocate P.P. Rao | Sakshi
Sakshi News home page

పీపీ రావుకు కన్నీటి వీడ్కోలు

Sep 15 2017 3:27 AM | Updated on May 29 2019 3:25 PM

పీపీ రావుకు కన్నీటి వీడ్కోలు - Sakshi

పీపీ రావుకు కన్నీటి వీడ్కోలు

ప్రముఖ న్యాయవాది పీపీ రావు అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని లోధీ శ్మశానవాటికలో ముగిశాయి.

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ న్యాయవాది పీపీ రావు అంత్యక్రియలు గురువారం ఢిల్లీలోని లోధీ శ్మశానవాటికలో ముగిశాయి. జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు సహా పలువురు సుప్రీంకోర్టు ప్రస్తుత, విశ్రాంత న్యాయమూర్తులు, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, అనేకమంది న్యాయవాదులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

అంతకుముందు పి.పి.రావు భౌతిక కాయానికి ఆయన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులుగా పేరు గాంచిన రావు ఈ ఏడాది జూలై మాసంలోనే న్యాయవాద వృత్తిలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్నారని వెంకయ్య గుర్తుచేశారు. కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement