
చివరకు ఓటమిని అంగీకరించి జరిమానా కట్టారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు రావొద్దని సంతోష్ పటేల్ వారిని హెచ్చరించారు.
భోపాల్: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు యువకులకు ఓ పోలీసు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. 30 పుషప్స్ చేస్తేనే జరిమానా లేకుండా విడిచిపెడతానని చాలెంజ్ విసిరారు. చివరకు ఆ ముగ్గురూ చాలెంజ్‌లో ఓడిపోయి రూ.1000 జరిమానా చెల్లించారు. ఈ ఆసక్తికరన ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నగరంలో గత మంగళవారం చోటుచేసుకోగా.. వైరల్ అయింది. కరోనా లాక్‌డౌన్ పాటించకుండా ముగ్గురు యువకులు గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డుపైకొచ్చారు. నిబంధనలు పాటించకుండా బయటకొచ్చిన వారిని ట్రైనీ డిప్యూటీ ఎస్పీ సంతోష్ పటేల్ అదుపులోకి తీసుకున్నారు.
(చదవండి: 30 బస్కీలు తీస్తే టికెట్ ఉచితం)
శారీరక కసరత్తులు చేసి ఫిట్‌నెస్ పెంచుకునేందుకే బయటికొచ్చామని యువకులు చెప్పిన సమాధానం విని వారితో ఓ చాలెంజ్ చేశారు. తనతో కలిసి పుషప్స్ చాలెంజ్‌లో పాల్గొని గెలవాలని షరతు విధించాడు. ముగ్గురూ తలో 30 ఫుషప్స్ చేయాలని లేదంటే సరైన పత్రాలు లేకుండా బండి నడిపినందుకు రూ.1000 జరిమానా కట్టాలని స్పష్టం చేశారు. వారు చాలెంజ్ స్వీకరించిన్పటికీ.. ఇద్దరు యువకులు 10 ఫుషప్స్‌తో ఢీలా పడగా.. మరొకరు 20 మాత్రమే చేయగలిగారు. చివరకు ఓటమిని అంగీకరించి జరిమానా కట్టారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు రావొద్దని సంతోష్ పటేల్ వారిని హెచ్చరించారు. ఇళ్లల్లోనే ఉండి ఎక్సర్‌సైజులు చేసుకోవాలని సూచించారు.
(చదవండి: నో లిక్కర్.. రోజుకు ఎంత నష్టమో తెలుసా?)