'నా శాఖలో దేశంలోనే అత్యంత అవినీతి' | most corrupt body and loot more than Chambal dacoits, says Gadkari | Sakshi
Sakshi News home page

'నా శాఖలో దేశంలోనే అత్యంత అవినీతి'

Dec 10 2015 8:34 PM | Updated on Sep 22 2018 8:22 PM

'నా శాఖలో దేశంలోనే అత్యంత అవినీతి' - Sakshi

'నా శాఖలో దేశంలోనే అత్యంత అవినీతి'

ప్రాంతీయ రవాణా కార్యాలయాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: ప్రాంతీయ రవాణా కార్యాలయాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వశాఖలు, కార్యాలయాలల్లో దేశం మొత్తం మీద అత్యంత అవినీతి జరిగేది ఇక్కేడే అని ఆయన ఆరోపించారు. చంబల్ బంధిపోట్ల దోపిడీ కంటే కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లోనే దోపిడీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ ఆఫీసుల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఏకంగా బంధిపోట్లనే మించిపోయారని వ్యాఖ్యానించారు. ఆర్టీఓ అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

మోటారు వాహనాల నూతన చట్టం ద్వారా ఈ రవాణాశాఖలో సంస్కరణలు తీసుకువస్తామన్నారు. ఆర్టీఓ అధికారులే రాష్ట్రాల్లో ఉండే మంత్రులను ఈ బిల్లుపై ముందడుగు వేయనివ్వడం లేదని చెబుతూ అవేదన వ్యక్తంచేశారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్స్లు చాలా సులువుగా లభిస్తాయని, ఇందులో 30 శాతం లైసెన్స్లు బోగస్ అని స్పష్టం చేశారు. నూతన చట్టం అమల్లోకొస్తే నియమాలు కఠినతరం చేస్తామని గడ్కరీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement