ముంబై దర్శన్‌లో మరిన్ని ప్రాంతాలు | More Areas in Mumbai Darshan | Sakshi
Sakshi News home page

ముంబై దర్శన్‌లో మరిన్ని ప్రాంతాలు

Sep 1 2014 10:22 PM | Updated on Oct 16 2018 5:14 PM

ముంబై దర్శన్‌లో మరిన్ని ప్రాంతాలు - Sakshi

ముంబై దర్శన్‌లో మరిన్ని ప్రాంతాలు

నగరానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త. మహారాష్ట్ర పర్యాటక అభివృద్థి సంస్థ (ఎంటీడీసీ) ‘ముంబై దర్శన్’ జాబితాలో కొత్త ‘పర్యాటక’అందాలను చేర్చనుంది.

సాక్షి, ముంబై: నగరానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త. మహారాష్ట్ర పర్యాటక అభివృద్థి సంస్థ (ఎంటీడీసీ) ‘ముంబై దర్శన్’ జాబితాలో కొత్త ‘పర్యాటక’అందాలను చేర్చనుంది. ఇందులో బాంద్రా-వర్లీ సీ లింకు, మెట్రో, మోనో రైళ్లు ఉన్నాయి. కొన్నేళ్లుగా నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలు అవిర్భవించాయి. ఇప్పటి వరకూ పర్యాటకులకు వాటి దర్శన భాగ్యం కల్పించడం లేదు. నూతన జాబితాతో త్వరలో మరిన్ని నగర అందాలు తిలకించే భాగ్యం పర్యాటకులకు లభించనుంది. సీ లింకు, మెట్రో, మోనో లాంటి ఈ కొత్త వింతలు ఆస్వాదించే అవకాశం కల్పించడానికి నిర్ణయించింది.

రోజూ ఇలా..
ముంబై నగర అందాలు, పర్యాటక ప్రాంతాలను తిలకించడానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఇక్కడి వింతలు, విశేషాలు వారికి తెలియకపోవడంతో ఎంటీడీసీని ఆశ్రయిస్తారు. ముంబై దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సుల్లో నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు.ఇందులో గేట్ వే ఆఫ్ ఇండియా, ఛత్రపతి శివాజీ టర్మినస్, అసెంబ్లీ భవనం, మెరైన్ డ్రైవ్, ఓవల్ మైదాన్, రాజాబాయి టవర్, ఏషియేటిక్ లైబ్రరీ, తారపోర్‌వాలా ఫిష్ ఎక్వేరియం, కమలా నెహ్రూ పార్క్, బూట్ బంగ్లా, బంగారు మహాలక్ష్మి, హాజీఅలీ, నెహ్రూ సెంటర్, సిద్ధివినాయక మందిరం ఇలా అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి.

ప్రస్తుతం కొత్తగా చేరిన సీ లింకు, మెట్రో, మోనో, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వే లాంటి వింతలు కూడా పర్యాటకులకు చూపించాలని ఎంటీడీసీ నిర్ణయించింది. గణేశ్ ఉత్సవాలు పూర్తికాగానే ఈ అందాలను పర్యాటకులకు చూపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంటీడీసీ అధికారి  చెప్పారు. దీని కారణంగా ముంబైకి పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement