పీఎంగా కంటే ఈఎంగానే ఎక్కువ కనిపిస్తున్నారు! | Modi more of an event manager than a PM: Aiyar | Sakshi
Sakshi News home page

పీఎంగా కంటే ఈఎంగానే ఎక్కువ కనిపిస్తున్నారు!

Jun 7 2015 5:42 PM | Updated on Aug 15 2018 2:20 PM

పీఎంగా కంటే ఈఎంగానే ఎక్కువ కనిపిస్తున్నారు! - Sakshi

పీఎంగా కంటే ఈఎంగానే ఎక్కువ కనిపిస్తున్నారు!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పీఎంగా కంటే ఈఎం(ఈవెంట్ మేనేజర్)గా ఉంటే బాగుండేదని కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ విమర్శించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ మణిశంకర్ అయ్యర్ తీవ్రంగా మండిపడ్డారు.  తనకు మోదీ పీఎంగా కంటే ఈవెంట్ మేనేజర్ గానే ఎక్కువగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ' నాకు మోదీ  పీఎంగా కంటే ఈఎంగానే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన ఎక్కువ సొంత పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజలు కచ్చితంగా ఆయన మనకు పీఎంగా ఉన్నారా?లేక ఈవెంట్ మేనేజర్ గా ఉన్నారా?అని ప్రశ్నించే రోజులు తప్పకుండా వస్తాయి' అని అయ్యర్ వ్యంగాస్త్రాలు సంధించారు.

 

ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి సంవత్సరం దాటిన ప్రజలకు చేసేందేమీ లేదంటూ అయ్యర్ మండిపడ్డారు. మోదీ అచ్చా దిన్ కార్యక్రమంతో బీజేపీ కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు.  ఎన్డీఏ పాలనపై ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని.. ప్రత్యేకంగా రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ పాలనతో పాటు కాంగ్రెస్ తదితర అంశాలపై మణిశంకర్ అయ్యర్ రాస్తున్న 'అచ్చా దిన్?హా!హా!!' పుస్తకం వచ్చే వారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement