7వ తేదీ నుంచి మోదీ ఆఫ్రికా టూర్ | Modi Africa Tour from the 7th | Sakshi
Sakshi News home page

7వ తేదీ నుంచి మోదీ ఆఫ్రికా టూర్

Jul 2 2016 2:16 AM | Updated on Jul 11 2019 8:48 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7 నుంచి ఐదు రోజుల పాటు నాలుగు ఆఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7 నుంచి ఐదు రోజుల పాటు నాలుగు ఆఫ్రికా దేశాలలో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంతో సంబంధాల పటిష్టతకు మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యాల్లో  పర్యటిస్తారు. అపార వనరులున్న ఆఫ్రికాలో పొరుగు దేశం చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు.

రాష్ట్రపతి ప్రణబ్జ్, ఉప రాష్ట్రపతి అన్సారీలు ఇటీవలే ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. ఆఫ్రికా- భారత్ మధ్య అత్యున్నత రాజకీయ స్థాయిలో సన్నిహిత సంబంధాల నిర్మాణం, సహకార బలోపేతం, పెంపొందించటానికి మోదీ పర్యటన దోహదం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement