ఎమ్మెల్యే ఇంటికి కన్నం | MLA Sushanta Borgohain official quarter burgled | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఇంటికి కన్నం

Oct 16 2013 7:09 PM | Updated on Sep 1 2017 11:41 PM

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో, అందులోనూ అధికారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నివాసంలో దొంగతనం జరిగింది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో, అందులోనూ అధికారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నివాసంలో దొంగతనం జరిగింది. మూడు లక్షల రూపాయల నగదు, భూ ఒప్పందం దస్తావేజులు ఇతర విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. అసోం రాజధాని గువహటిలో ఈ సంఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మెల్యే సుశాంత బొర్గొహైన్ కుటుంబం ఇంట్లో లేని సమయంలో బెడ్రూం కిటికీని బద్దలుకొట్టి దొంగలు లోనికి ప్రవేశించి దోచుకెళ్లారు. సుశాంత బుధవారం ఇంటికి రాగనే విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. చోరీ సంఘటనపై సుశాంత, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత పార్టీ ప్రభుత్వంపైనే ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement