బాలికపై లైంగిక దాడి.. హత్య! | Minor girl raped, murdered in lonavala | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి.. హత్య!

Feb 19 2015 3:12 PM | Updated on Sep 2 2017 9:35 PM

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన పుణె సమీపంలోని లోనవాలా హోటల్లో చేసుకుంది.

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన పుణె సమీపంలోని లోనవాలా హోటల్లో చేసుకుంది. మహారాష్ర్టలోని రాయ్గఢ్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలిక ఆదివారం తన తల్లిదండ్రులతో కలసి లోనావాలా హోటల్లోని ఓ వివాహానికి  వచ్చింది. తర్వాత కనిపించకుండా పోయింది. తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు అదే హోటల్ టెర్రస్పై బాలిక శవమై కనిపించడం తల్లిదండ్రులతో పాటు అక్కడి వారిని షాక్ గురిచేసింది.

ప్రాథమిక దర్యాప్తులో ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది. పూర్తి స్థాయి శవ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత కేసును మరింత వేగంగా దర్యాప్తు చేస్తామని, నిందితులను అంత తేలికగా వదిలిపెట్టబోమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హోటల్ సిబ్బందితోపాటు పెళ్లికి హాజరైనవారిని విచారిస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని కూడా తీసుకుని పరిశీలిస్తున్నారు. అయితే, తాము ముందే ఫిర్యాదు చేశామని, సరైన విధంగా పోలీసులు స్పందించకపోవడంవల్లే ఈ దారుణం చూడాల్సి వచ్చిందని తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement