జార్ఖండ్‌లో అత్యంత కిరాతక ఘటన చోటు చేసుకుంది. జమ్‌షెడ్‌పూర్‌లోని బాగ్‌బెరా ప్రాంతంలో 14 ఏళ్ల మైనర్ బాలికను నాలుగురు వ్యక్తులు అత్యంత రాక్షసంగా అత్యాచారం చేసి.. ఆమెను మురికి కాలువలోకి విసిరేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాంచీ: జార్ఖండ్‌లో అత్యంత కిరాతక ఘటన చోటు చేసుకుంది. జమ్‌షెడ్‌పూర్‌లోని బాగ్‌బెరా ప్రాంతంలో 14 ఏళ్ల మైనర్ బాలికను నాలుగురు వ్యక్తులు అత్యంత రాక్షసంగా అత్యాచారం చేసి.. ఆమెను మురికి కాలువలోకి విసిరేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలని గుర్తించిన స్థానికులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రాణంతో ఉన్న బాధితురాలని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక సర్దార్ ఆసుపత్రికి తరలించారు. అనుమానితులగా భావిస్తున్న అభయ్ యాదవ్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ విమల్ కుమార్ చెప్పారు.