అది రాముడి చలవే.. | UP minister Says India A Global Superpower Due To Lord Ram | Sakshi
Sakshi News home page

అది రాముడి చలవే..

Nov 19 2018 2:42 PM | Updated on Aug 30 2019 8:37 PM

UP minister Says India A Global Superpower Due To Lord Ram   - Sakshi

భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదిగింది ఎందుకంటే..

లక్నో : రాముడి వల్లే భారత్‌ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, ప్రజలు ఆదర్శ పురుషుడైన రాముడి జీవితం నుంచి పాఠాలు నేర్చుకోవాలని యూపీ కేబినెట్‌ మంత్రి లక్ష్మీ నారాయణ చౌధరి వ్యాఖ్యానించారు. అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్‌ గురించి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో అయోధ్యలో రాముడు జన్మించిన చోట రామ మందిరం నిర్మించారని మంత్రి గుర్తుచేశారు. అయోథ్యలో రామమందిర నిర్మాణం జరగాలన్నదే దేశ ప్రజల ఆకాంక్షగా ముందుకొస్తోందన్నారు. ప్రజాకాంక్షలకు అద్దం పడుతూ అయోధ్యలో మందిర నిర్మాణం చేపట్టాలని అన్నారు. వీలైనంత త్వరలో మందిర నిర్మాణం పూర్తిచేస్తే అయోధ్య అద్భుత చరిత్రను పదిలపరచడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.

అదే జరిగితే అయోధ్యకు పెద్ద ఎత్తున యాత్రికులు తరలివస్తారని, ఫలితంగా పెద్ద ఎత్తున పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. రాముడు యుద్ధవీరుడిగా, తండ్రి మాటకు కట్టుబడ్డ తనయుడిగా తామందరికీ ఆదర్శప్రాయుడని మంత్రి కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement