వలస కార్మికులను ముందుగానే పంపి ఉంటే..

Migrants Return during lockdown worsened spread of coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనాను కట్టడి చేయడం కోసం అనూహ్యంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వలస కార్మికులు ఆ మరుసటి రోజు నుంచే  తమ స్వస్థలాకు బయల్దేరిన విషయం తెల్సిందే. అలా రాజస్థాన్‌ రాష్ట్రానికి మొదటి విడతన అంటే మార్చి 25 తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, ముంబై, ఇండోర్‌ నగరాల నుంచి దాదాపు మూడు లక్షల మంది రాజస్థాన్‌కు చేరుకున్నారు. వీరంతా కాలి నడకన, సొంత వాహనాలు, ఇతర కిరాయ వాహనాల్లో నానా కష్టాలు పడి స్వస్థలాలకు చేరుకున్నారు. (పంజాబ్ సీఎం కీలక నిర్ణయం)

అప్పటికి రాష్ట్రంలో కరోనా కేసుల శాతం ఒక శాతం ఉండగా, వలస కార్మికుల రాకతో 1.5 శాతానికి చేరుకుందని ‘ఆజీవిక బ్యూరో’ లెక్కలు తెలిపింది. మే 4వ తేదీ నుంచి వలస కార్మికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా అనుమతించడంతో మరో విడత వలస కార్మికుల రాక మొదలైంది. మే చివరి దాక కొనసాగిన ఈ వలస కార్మికుల రాకలో రాజస్థాన్‌కు మరో నాలుగు లక్షల మంది చేరుకున్నారు. అప్పటి వరకు 1.5 శాతం ఉన్న కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా మూడు శాతానికి చేరుకుంది. (క్వారంటైన్ బబుల్ కొత్త దృక్పథం)

మొదటి విడతలో చేరుకున్న వలస కార్మికులకంటే రెండు విడతలో చేరుకున్న వలస కార్మికుల్లో రెంటింపు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన వలస కార్మికులను తరలించాకే దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేసి ఉన్నట్లయితే నేడు కరోనా మహమ్మారి ఇంత తీవ్రంగా ఉండేది కాదని ఆజీవిక బ్యూరోతోపాటు రాజస్థాన్‌లో వలస కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ‘బేసిక్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌’ సహ వ్యవస్థాపకులు పవిత్ర మోహన్‌ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య దాదాపు 20 వేలకు చేరుకుంది. (లాక్డౌన్ సడలించాక పెరిగిన కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top