అఖిలేష్‌కు బెహన్‌ బాసట

Mayawati Stands Behind Akhilesh Yadav As CBI Probe Looms Large - Sakshi

లక్నో : మైనింగ్‌ స్కామ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో బీఎస్పీ చీఫ్‌ మాయావతి సోమవారం అఖిలేష్‌కు బాసటగా నిలిచారు. దాడుల పేరుతో రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టే బీజేపీ వ్యూహాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారని మాయావతి పేర్కొన్నారు. కేంద్రం వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని, కుట్రలను నీరుగార్చాలని అఖిలేష్‌తో భేటీ సందర్భంగా మాయావతి స్పష్టం చేశారని బీఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2012-13లో మైనింగ్‌ గనుల కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించిన అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే దానికి అప్పటి సీఎం అఖిలేష్‌ యాదవ్‌ బాధ్యులు ఎలా అవుతారని సోమవారం ఎస్పీ, బీఎస్పీ నేతల సంయుక్త సమావేశంలో బీఎస్పీ ఎంపీ సతీష్‌ మిశ్రా ప్రశ్నించారు.

ఎన్డీఏ కూటమి నుంచి భాగస్వామ్య పక్షాలు వైదొలుగుతుంటే వారు కొత్తగా సీబీఐతో దోస్తీకి దిగారని ఎద్దేవా చేశారు. కాగా అఖిలేష్‌పై సీబీఐని ప్రయోగించడం పట్ల మోదీ సర్కార్‌పై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న నియంత సర్కార్‌ను సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top