
సాక్షి, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. రాజ్ నందిగామ్ జిల్లా బాగ్ని పోలీస్ స్ట్రేషన్ పరిధిలో జవాన్లపై మావోలు దాడులకు పాల్పడ్డారు. వేర్వేరు సంఘటనల్లో ముగ్గురి జవాన్లను చంపారు. శనివారం అర్ధ రాత్రి సమయంలో ఒక వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వెళ్తున్న జవాన్ల వాహనంపై మావోలు దాడి చేశారు. దాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో రవి అనే జవానుకు బుల్లెట్ తగటడంతో అక్కడిక్కడే మరణించాడు. దీనితో పాటు కుంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోలు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. గత వారం రోజులుగా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో మావోలు జరిపిన దాడులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలతో దండకారుణ్యాన్ని జల్లెడ పడుతున్నారు.