చివరి రోజు కూడా ప్రధానిది అదే తీరు! | Sakshi
Sakshi News home page

చివరి రోజు కూడా ప్రధానిది అదే తీరు!

Published Tue, May 13 2014 9:54 PM

చివరి రోజు కూడా ప్రధానిది అదే తీరు! - Sakshi

న్యూఢిల్లీ: తన పదవీకాలంలో చివరి రోజున ప్రధాని మన్మోహన్ సింగ్ కు గురువారం సౌత్ బ్లాక్ లోని ఆయన కార్యాలయ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఇండియన్ ఆర్మీ వైస్ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకానికి ఆమోదం తెలుపడానికి కేంద్ర మంత్రివర్గం నేడు సమావేశమైంది. లోకసభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన  మరుసటి రోజు మే 17 తేదిన ప్రధాని మంత్రి పదవికి మన్మోహన్ సింగ్ రాజీనామా సమర్పిస్తారు. 
 
సౌత్ బ్లాక్ వద్ద ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ)లో పనిచేస్తున్న 110 మంది ఉద్యోగులు మన్మోహన్ సింగ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. యూపీఏ ప్రభుత్వ హయంలో మొత్తం ఓ దశాబ్దకాలం ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. ఈ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ఎప్పటిలానే ఎలాంటి ఉద్వేగానికి గురికాకుండా కనిపించారు. ప్రధాని ముఖంలో ఎలాంటి ఎమోషన్స్ కనిపించలేవు. వీడ్కోలు సమావేశంలో ముభావంగా, సాధారణంగా కనిపించారు. అధికారులు ప్రధానికి పుష్ఫగుచ్చాలందించి కృతజ్క్షతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతికి ఎనలేని సేవలందించారని సిబ్బందిని ప్రధాని అభినందించారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement