తల మీద పాము.. గమనించకుండా 11 కిలోమీటర్లు

Man Rides With Venomous Snake In Helmet For 11Kms - Sakshi

తిరువనంతపురం: బైక్‌లు, షూలు, ఏసీలు, కార్లలో పాములు దూరడం చూసి ఉంటాం. కానీ ఓ పాము ఏకంగా హెల్మెట్‌లో దూరింది. అది గమనించని ఆ వ్యక్తి ఏకంగా తలపైనే విష సర్పాన్ని పెట్టుకొని 11 కిలోమీటర్లు ప్రయాణించాడు.  గమ్యం చేరుకునేదాక దానిని చూసుకోలేదు. తీరా స్కూలుకు చేరుకున్నాక చూసుకుంటే తనకేం కానందుకు బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. కేరళలోని ఓ ఉపాధ్యాయుడికి ఈ వింత అనుభవం ఎదురైంది.

కందానాద్ సెయింట్ మేరీ హైస్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ రంజిత్‌ తన ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరాడు. ఎప్పటిలాగే బైక్ వద్ద ఉన్న హెల్మెట్ పెట్టుకొని స్కూల్‌ను చేరుకోగానే హెల్మెట్ తీస్తుండగా లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో దాన్ని పరిశీలనగా చూసి షాకయ్యాడు. అందులో ఓ పాము చనిపోయి కనిపించింది. తాను హెల్మెట్ పెట్టుకోవడం వల్లే చనిపోయిందా లేక ఎవరైనా కావాలనే పెట్టారా అనేది తెలియలేదు. రంజిత్‌కు ఆ పాము నుంచి ఎలాంటి ప్రమాదం లేకపోయినా అతడి సహోద్యోగులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అతడికి రక్త పరీక్ష చేశారు. అయితే ఆ పాము అతడిని కాటేయలేదని చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top