నోట్లో గుడ్డలు కుక్కి...టీవీ వాల్యూమ్ పెంచి... | Man kills wife in front of 2-year-old daughter in Jalna | Sakshi
Sakshi News home page

నోట్లో గుడ్డలు కుక్కి...టీవీ వాల్యూమ్ పెంచి...

Jun 20 2016 11:24 AM | Updated on Jul 29 2019 5:43 PM

నోట్లో గుడ్డలు కుక్కి...టీవీ వాల్యూమ్ పెంచి... - Sakshi

నోట్లో గుడ్డలు కుక్కి...టీవీ వాల్యూమ్ పెంచి...

ఔరంగాబాద్ లో రెండు సంవత్సరాల చిన్నారి ముందే భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త.

ఔరంగాబాద్ లో  రెండు సంవత్సరాల  చిన్నారి ముందే  భార్యను దారుణంగా హత్య చేశాడో  భర్త.  పరాయిపురా లోని  జాల్నాకు చెందిన అశోక్ లఖన్ లాల్ సుర (35) భార్య పూజ (25)పై  దాడిచేసి హత్య చేశాడు.  ఈ ఘటన స్థానికంగా కలకలం  రేపింది. భార్యను పూపిరాడకుండా చేసిన హత్య చేసిన నిందితుడు అనంతరం పోలీసు స్టేషన్ కెళ్లి లొంగిపోయాడు.   పోలీసును సైతం విస్మయపర్చిన ఈఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  నిందితుడు అశోక్ కి పూజతో ఆరేళ్ల క్రితం పెళ్లి అయింది. ఉమ్మడి కుటుంబంలో నివసించే  వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.  మద్యానికి బానిసైన నిందితుడికి కుటుంబ సభ్యులు ఇటీవల డ్రగ్ ఎడిక్షన్  చికిత్స కూడా  చేయించారు. అయితే ఏమైందో  ఏమో తెలియదు గానీ.. ఆదివారం ఉదయం  భార్య నోటిలో గుడ్డలు  కుక్కి,  హింసకు పాల్పడ్డాడు.   భార్య నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో... ఆమె అరుపులు ఎవరికీ వినబడకుండా.. టీవీ వాల్యూమ్ బాగా పెంచి మరీ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో గొంతుపై తీవ్రంగా పొడవంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. 

అనంతరం అక్కడినుంచి పారిపోయిన అశోక్...పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు.అయితే ఇదంతా ప్రత్యక్షంగా గమనించిన పాప..నానమ్మకు సమాచారం అందించింది.  రక్తపు మడుగులో వున్న  కోడల్ని  చూసి  హతాశురాలైన ఆమె చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. ఇంతలో   సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని  స్వాధీనం చేసుకుని..పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కాగా నిందితుడిపై హత్య కేసు నమోదు చేసామని,  సదర్ బజార్  స్టేషన్  ఎస్ఐ జైసింగ్ మదన్ సింగ్ పరదేశి  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement