ఇండియా గేట్ వద్ద ఉరేసుకున్నాడు | Man hangs self near India Gate | Sakshi
Sakshi News home page

ఇండియా గేట్ వద్ద ఉరేసుకున్నాడు

Apr 6 2015 11:27 AM | Updated on Oct 8 2018 3:07 PM

న్యూఢిల్లీ: భారత రాజధానిలోని ఇండియా గేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇండియా గేట్కు సమీపంలోని ఓ పార్క దగ్గర ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.

న్యూఢిల్లీ: భారత రాజధానిలోని ఇండియా గేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇండియా గేట్కు సమీపంలోని ఓ పార్క దగ్గర ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. అతడు ఈ అఘాయిత్యానికి సోమవారం తెల్లవారు జామున మూడు నుంచి ఐదుగంటల ప్రాంతంలో పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు.

వివరాల్లోకి వెళ్లగా.. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయి అనే ప్రాంతానికి చెందిన శేషనాథ్ (31) అనే వ్యక్తి జన్పథ్కు వెళ్లే దారిలో ఇండియా గేట్కు సమీపంలో ఉన్న పార్క్లోని చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడని చెప్పారు. కొందరు సమాచారం అందిండచడంతో వెళ్లి చూడగా అతడు అప్పటికే మరణించాడని తెలిపారు. జేబులో ఒక్క ఐడెంటీ కార్డు తప్ప స్యూసైడ్ నోట్ కనిపించలేదని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement