సెల్ఫీ పిచ్చి.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడి మృతి | Man electrocuted while take selfie on train roof in Jharkhand | Sakshi
Sakshi News home page

సెల్ఫీ పిచ్చి.. హైటెన్షన్ వైర్లు తగిలి యువకుడి మృతి

Feb 11 2019 7:07 PM | Updated on Feb 11 2019 8:28 PM

Man electrocuted while take selfie on train roof in Jharkhand - Sakshi

జంషెడ్ పూర్ : సెల్ఫీసరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గూడ్స్ రైలుపై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఓ యువకుడు, మరో బాలుడికి హైటెన్షన్ వైర్లు తాకి షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఎండీ ఫైజల్ (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నవేద్ అక్తర్ (11)కు తీవ్రగాయాలయ్యాయి. జంషెడ్‌పూర్‌లోని టాటానగర్‌ రైల్వే స్టేషన్‌ సమపంలోని సల్గాజ్ హురిలోఈ ప్రమాదం జరిగింది.

ఫైజల్‌ హైటెన్షన్‌ వైర్‌కే అతుక్కుపోగా, అక్తర్‌ షాక్‌కు రైలు నుంచి కిందపడిపోయాడు. గాయపడిన నవేద్ అక్తర్ ను టాటా మెయిన్ ఆస్పత్రికి తరలించారు. గూడ్స్ రైలు నింపురా యార్డు వెళ్లాల్సిన సమయంలో సిగ్నల్‌ కోసం వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement