ప్రయాణికుడి ఆత్మాహుతియత్నం.. రైల్లో మంటలు | Man attempts immolation in train | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి ఆత్మాహుతియత్నం.. రైల్లో మంటలు

Aug 16 2016 3:02 PM | Updated on Sep 4 2017 9:31 AM

ప్రయాణికుడి ఆత్మాహుతియత్నం.. రైల్లో మంటలు

ప్రయాణికుడి ఆత్మాహుతియత్నం.. రైల్లో మంటలు

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కేరళలోని త్రివేండ్రం - నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలు టాయిలెట్‌లో ఆత్మాహుతి యత్నం చేశాడు. దాంతో రైలు బోగీలో మంటలు చెలరేగాయి.

తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కేరళలోని త్రివేండ్రం - నేత్రావతి ఎక్స్‌ప్రెస్ రైలు టాయిలెట్‌లో ఆత్మాహుతి యత్నం చేశాడు. దాంతో రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఈ కారణంగా అళప్పుజ జిల్లాలోని కాయంకులం స్టేషన్‌లో రైఉలును మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాసేపు ఆపేశారు. తమిళనాడులోని వెల్లూరు ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

అతడిని వారు అదుపులోకి తీసుకుని అళప్పుజ మెడికల్ కాలేజి ఆస్పత్రికి తరలించారు. అతడికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ఇంజన్‌కు సమీపంలో ఉన్న జనరల్ కంపార్టుమెంటు టాయిలెట్‌ లోపలి నుంచి పొగ రావడం తాము చూశామని తోటి ప్రయాణికులు చెప్పారు. అధికారులు వెంటనే ఆ బోగీని వేరుచేసి, దూరంగా తీసుకెళ్లి ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేశారు.

Advertisement

పోల్

Advertisement