ఉద్యోగి చెంపచెళ్లుమనిపించిన మంత్రి తండ్రి | Maha minister's father Vitthalrao Patil slapped a staff | Sakshi
Sakshi News home page

ఉద్యోగి చెంపచెళ్లుమనిపించిన మంత్రి తండ్రి

Jul 3 2017 8:25 AM | Updated on Sep 5 2017 3:06 PM

ఉద్యోగి చెంపచెళ్లుమనిపించిన మంత్రి తండ్రి

ఉద్యోగి చెంపచెళ్లుమనిపించిన మంత్రి తండ్రి

మహారాష్ట్ర హోం మంత్రి రంజిత్‌ పాటిల్‌ తండ్రి వీఎన్‌ పాటిల్‌ ఓ స్కూల్‌ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపచెళ్లుమనిపించాడు.

ముంబై :
మహారాష్ట్ర మంత్రి రంజిత్‌ పాటిల్‌ తండ్రి వీఎన్‌ పాటిల్‌ ఓ స్కూల్‌ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపచెళ్లుమనిపించారు. స్కూల్‌ తనిఖీ చేయడానికి వచ్చానని చెప్పి ఉద్యోగి పైచేయి చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  వీఎన్‌ పాటిల్‌ గతంలో శాసనమండలి సభ్యులుగా కూడా చేశారు. ఈ సంఘటన అకోలా జిల్లాలోని మూర్తిజాపుర్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది.

వీఎన్‌ పాటిల్‌కు చెందిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ స్కూల్‌ ఉంది. అదే మండలపరిధిలోని మరో స్కూల్‌లో విద్యార్థులను ఎక్కువగా ఎందుకు జాయిన్‌ చేసుకుంటున్నారని స్కూల్ సిబ్బందిపై వీఎన్‌ పాటిల్‌ మండిపడ్డట్టు సమాచారం. అదే సమయంలో తనను అసభ్యపదజాలంతో తిడుతూ చేయిచేసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రంజిత్‌ పాటిల్‌ చెప్పారు. అయితే తన తండ్రి ఎవరినీ కొట్టలేదని తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటికొస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement