స్పీకర్ ను సర్ప్రైజ్ చేసిన లోకసభ సభ్యులు | LS members singing 'Happy Birthday' for Sumitra Mahajan shows Indian democracy is alive and kicking | Sakshi
Sakshi News home page

స్పీకర్ ను సర్ప్రైజ్ చేసిన లోకసభ సభ్యులు

Apr 12 2017 7:10 PM | Updated on Sep 5 2017 8:36 AM

స్పీకర్ ను సర్ప్రైజ్ చేసిన లోకసభ సభ్యులు

స్పీకర్ ను సర్ప్రైజ్ చేసిన లోకసభ సభ్యులు

లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను సభ సభ్యులు సర్ ప్రైజ్ చేశారు.

న్యూఢిల్లీ : లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను సభ సభ్యులు సర్ ప్రైజ్ చేశారు. బుధవారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని సభ సభ్యులందరూ 'హ్యాపీ బర్త్ డే' సాంగ్ ను ఆలపించారు. వారి బర్త్ డే సాంగ్ మురిసిపోయిన సుమిత్రా మహాజన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఒక్క సారిగా పైకి లేచి, హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడారు.   ఆయురారోగ్యాలతో, సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటూ వారు ప్రార్థన నిర్వహించారు. వారి ప్రార్థనలకు ఆమె ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలయ్యారు.
 
నేడు ఆమె 73 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సభ మొత్తం తరుఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలను తెలిపారు.''సభ్యులందరి తరుఫున మీరు సుదీర్ఘ కాలం పాటు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు.  ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ వారి శుభాకాంక్షలకు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు. సభ నిర్వహించేటప్పుడు తను వ్యవహరించే తీరును, మందలింపు చర్యలను ఎవరూ సీరియస్ తీసుకోరని ఆశిస్తున్నట్టు సుమిత్రా పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement